Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

19-06-2020 శుక్రవారం మీ రాశి ఫలితాలు.. శుక్రవారం పూట..?

19-06-2020 శుక్రవారం మీ రాశి ఫలితాలు.. శుక్రవారం పూట..?
, శుక్రవారం, 19 జూన్ 2020 (01:00 IST)
కనకదుర్గాదేవిని పూజించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. స్త్రీలు పనివారలతో చికాకులు, ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు.
 
వృషభం: వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ వుండదు. వృత్తుల వారికి సదవకాశాలు లభించినా ఆశించినంత సంతృప్తి వుండదు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
మిథునం: దాన ధర్మాలు చేసి మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ విషయంలో ఏకాగ్రత చాలా అవసరం. రాజకీయ నాయకులు తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పెద్దలు, అనుభజ్ఞుల సలహాలు పాటించడం వల్ల ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు.
 
కర్కాటకం: వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. సొంతంగా గృహం ఏర్పరుచుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొబ్బరి, మామిడి, పండ్ల, పూల, కూరగాయ రంగాల్లో వారికి లాభదాయకం.
 
సింహం: కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య చికాకులు తలెత్తుతాయి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు.
 
కన్య: ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సాహిత్య రంగాల్లోని వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీల యత్నాలకు అయిన వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
 
తుల: రాజకీయ, కళలు, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్త్రీలు కొత్త వ్యక్తులతో తక్కువగా సంభాషించడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం అధికం. భార్యాభర్తల మధ్య అవగాహన లేక చికాకులు వంటివి ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు కొత్త అధికారులు, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు షాపింగ్‌లోను, స్కీమ్‌ల పట్ల అవగాహన అవసరం. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. ప్రయాణాలు ఆశించినంత ఉత్సాహంగా సాగవు.
 
ధనస్సు: ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
మకరం: దంపతుల మధ్య సఖ్యత, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటాయి. మిమ్ములను వ్యతిరేకించిన వారిని సైతం మీ వైపునకు తిప్పుకోగలుగుతారు. కీలకమైన వ్యవహారాల్లో కుటుంబీకుల సలహా పాటించడం మంచిది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
 
కుంభం: ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ఇతరులు మీ దృష్టిని మరల్చేందుకు యత్నిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలవడం కష్టమే. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. దైవ కార్యాల పట్ల ఆసక్తి కలుగుతుంది.
 
మీనం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు తావివ్వవద్దు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం మంచిది. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి కాగలవు. ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భద్రాచలం గర్భగుడిపై వున్న సుదర్శన చక్రం చరిత్ర.. రామదాసుకు..? (Video)