Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్ద కుమార్తెను రేప్ చేసి జైలుకెళ్లి.. తిరిగివచ్చి చిన్న కుమార్తెపై తండ్రి లైంగికదాడి

Advertiesment
పెద్ద కుమార్తెను రేప్ చేసి జైలుకెళ్లి.. తిరిగివచ్చి చిన్న కుమార్తెపై తండ్రి లైంగికదాడి
, గురువారం, 25 జూన్ 2020 (16:25 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి అభంశుభం తెలియని ఆ ఇద్దరు మైనర్ బాలికల పాలిట కామాంధుడిగా మారిపోయాడు. తొలుత పెద్ద కుమార్తెపై అత్యాచారం చేసి జైలుకెళ్లాడు. ఆ తర్వాత ఇటీవలే విడుదలై వచ్చి చిన్న కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. భర్త ప్రవర్తనను సందేహించిన భార్య... చిన్న కుమార్తెను వైద్య పరీక్షలకు తీసుకెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణేకు సమీపంలోని పింప్రి చించ్వాడకు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి తన 11 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకెళ్లాడు. 
 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇటీవల అనేక మంది ఖైదీలను విడుదల చేశారు. దీంతో ఇటీవల ఇంటికి వచ్చిన ఈ కామాంధుడు.. ఈ దఫా తన చిన్న కూతురిపై కన్నేశాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఈ నీచుడి భార్య.. కుమార్తెను వైద్య పరీక్షలకు తీసుకెళ్లడంతో ఇతను చేసిన ఘాతుకం వెలుగుచూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు కీచకతండ్రిని అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చట్టబద్ధత లేని షోకాజ్ నోటీసు : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు