Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యక్తిని చంపి.. తలను ముక్కలు చేసి.. టిఫిన్ బాక్సులో పెట్టి...

Advertiesment
Kadapa
, బుధవారం, 24 జూన్ 2020 (15:54 IST)
రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో దారుణం జరిగింది. జిల్లాలోని యర్రగుంట్లలో ఐసీఎల్ రిటైర్డ్ ఉద్యోగి వెంకట రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈయనను హత్య చేసి, తలను శరీరం నుంచి వేరు చేసి, దాన్ని కూడా ముక్కలు చేసి టిఫిన్ బాక్సులో పెట్టి లోయలో పడేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యర్రగుంట్లలో ఐసీఎల్ రిటైర్డ్‌ ఉద్యోగి వెంకట రమణయ్య తలను గువ్వల చెరువు ఘాట్ వద్ద ఓ టిఫిన్ బాక్సులో పోలీసులు గుర్తించారు. 
 
ఆ తలను ముక్కలు చేసి టిఫిన్ బాక్సులో పెట్టి ముసలయ్య లోయలో పడేసినట్లు తేల్చారు. అనంతరం ఆయన ఇంట్లో వెంకట రమణయ్య మొండాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. 
 
ప్రాథమిక విచారణలో భాగంగా, మునిసిపల్ మాజీ ఛైర్మన్ ముసలయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ సర్కారుపై కోర్టు ధిక్కరణ : పిటిషన్ పైల్ చేసిన నిమ్మగడ్డ