ఉద్యోగాల పేరిట మోసం.. కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన లేడి సింగం

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (12:29 IST)
Rana pogag
నిరుద్యోగుల సంఖ్య దేశంలో పెరిగిపోతోంది. ఉద్యోగాల కోసం నానా తంటాలు పడుతున్నారు. అంతేగాకుండా.. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే ఇట్టే వారిని నమ్మేస్తున్నారు. వారిచేతిలో మోసాలకు గురౌతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాణా పోగాగ్ అనే వ్యక్తి తాను స్థానికంగా పబ్లిక్ రిలేషన్ అధికారినంటూ అక్కడి అధికారులతో, స్థానికులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతనికి మజులి జిల్లాలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జున్మోని రాభాతో పరిచయం ఏర్పడింది. 
 
అది కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరు పెద్దల అంగీకారంతో గత ఏడాది అక్టోబరులో ఎంగెజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఈ జంట ఈ ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకోనున్నారు.
 
ఈ క్రమంలో కాబోయే భర్త గురించి పలు షాకింగ్ విషయాలు వెలుగులోనికి వచ్చాయి. కొంత మంది వ్యక్తులు రాణా పోగాగ్ చేస్తున్న మోసాలకు గురించి ఆమెకు ఫిర్యాదు చేశారు. రాణాపోగాగ్ స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారని ఆమె ఎదుట వాపోయారు. 
 
దీంతో ఆమె షాక్‌కు గురైంది. వెంటనే అతగాడిని మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. కాగా, ఫిర్యాదు చేసిన వారికి ఆమె ధన్యవాదాలు కూడా తెలిపారు. తనకు కాబోయే భర్త విషయాలు బాగోతాలు చెప్పిన వ్యక్తులకు, తన జీవితాన్ని కాపాడారని ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments