Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకానికి ఏపీ హైకోర్టు ఓకే

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (11:54 IST)
థియేటర్లలో బ్లాక్ టిక్కెట్ల అమ్మకాలను నియంత్రించాలన్న ఏకైక ఉద్దేశ్యంతో సినిమా టిక్కెట్ల అమ్మకాలను ఆన్‌లైన్‌లో విక్రయించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ విధానాన్ని సినీ నిర్మాతల, చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులు తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
ఈ అంశం కోర్టుకు చేరింది. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు.. ప్రస్తుతానికి సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అమ్ముకునేందుకు అనుమతిచ్చింది. కొంతకాలం ఆన్‌లైన్‌లో జరిగే టిక్కెట్ల అమ్మకాన్ని పరిశీలించిన తర్వాత తుది ఆదేశాలు జారీచేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 
ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా టిక్కెట్ల విక్రయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఎలా ఉంటుందో కొన్ని రోజులు పరిశీలిద్ధామని పేర్కొంది. ముఖ్యంగా, మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు తమ సొంత వేదికలపై టిక్కెట్లు అమ్ముకునేందుకు ప్రస్తుతానికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. అదేసమయంలో మల్టీప్లెక్స్ యాజమాన్యాల అభ్యర్థలను తదుపరి విచారణలో పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments