Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. మోజు తీరాక కూతురిపై కన్నేశాడు..

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (11:35 IST)
ప్రేమ పేరుతో వివాహితను నమ్మించాడు. మొదటి భర్తకు విడాకులు ఇప్పించి, రెండో పెళ్లి చేసుకుని, ఆమె కూతురిపై కన్ను వేసిన ఓ కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. పీఠాపురం ఆ వివాహిత ఓ ప్రైవేటు టీచర్‌. ఇద్దరు కుమార్తెలు, భర్తతో ఆనందంగా వైవాహిక జీవితం గడుపుతోంది. ఇంతలో సురేష్‌కుమార్‌ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టాడు. తనకు వివాహమైందని ఎంత చెప్పినా వినకుండా.. పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానంటూ భయపెట్టాడు.
 
అతడి ఒత్తిడికి తలొగ్గిన ఆమె విచక్షణ కోల్పోయి.. తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న భర్తకు విడాకులిచ్చి.. ఇద్దరు కుమార్తెలతో బయటకు వచ్చేసి, సురేష్‌కుమార్‌ను రెండో పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లు తరువాత ఆమెపై మోజు తగ్గిన ఆ దుర్మార్గుడు అసలు రూపం చూపసాగాడు. 
 
ఆమెను చిత్రహింసలు పెట్టడమే కాకుండా, ఆమె ఇంట్లో లేనపుడు ఆమె కుమార్తెను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న తల్లి గొడవ పెట్టడంతో కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడ్డాడు.
 
రెండో పెళ్లి కూడా కావడంతో కాపురం ఎక్కడ చెడిపోతుందోనన్న భయంతో ఆమె అతడిని వదిలేసింది. అదే అదనుగా సురేష్‌కుమార్‌ ఆమెను చిత్రహింసలు చేయసాగాడు. చివరకి  వేధింపులు తాళలేక స్పందన కార్యక్రమంలో తన గోడు వెళ్లబోసుకుంది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments