Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ పార్టీపై పీకే ప్రకటనః 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (11:18 IST)
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు. రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ పీకే ప్రకటించారు. అక్టోబర్ 2 నుంచి బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడతానని పీకే ప్రకటించారు. 
 
సాధ్యమైనంత మంది ప్రజలను తన పాదయాత్ర ద్వారా చేరుకుంటానని చెప్పారు. దీన్ని కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నంగా అభివర్ణించారు. 
 
బీహార్‌లో ఇప్పట్లో ఎన్నికలు లేవంటూ.. రాజకీయ పార్టీ అనేది ప్రస్తుతానికి  తన ప్రణాళికల్లో లేదని స్పష్టం చేశారు. "నేను జీరో నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి. స్వరాజ్యం అనే ఆలోచనతో రానున్న మూడు నాలుగేళ్లలో సాధ్యమైనంత మంది ప్రజలను కలుసుకోవాలి" అంటూ తన భవిష్యత్ ప్రణాళికను పీకే చెప్పకుండానే చెప్పేశారు. 
 
రాష్ట్రంలో ఏ పార్టీతోనూ కూటమి ఉండదని చెబుతూ.. ఆర్జేడీ, జేడీయూ పార్టీలపై విమర్శలు చేశారు. గత 15 ఏళ్లలో బీహార్‌కు ఒరిగిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో తనకు ఎటువంటి వ్యక్తిగత ఘర్షణ లేదన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments