Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్నేహితుడితో కలిసి ఇంట్లో ఉన్నపుడే అత్యాచారం : ఎస్పీ వివరణ

woman victim
, మంగళవారం, 3 మే 2022 (15:34 IST)
విజయనగరంలో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ వివరణ ఇచ్చారు. బాధితురాలు తన స్నేహితుడితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో మరో యువకుడు వచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశామని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఘటనతో సంబంధం ఉన్న వారిని ఒక్కరిని కూడా వదిలిపెట్టమని హెచ్చిరంచారు. 
 
నగరంలోని ఉడా కాలనీకి చెందిన ఓ యువతి తన స్నేహితుడితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఈ దారుణం జరిగిందన్నారు. బాధితురాలి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారని, వారిలో ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి పాలపడ్డారని చెప్పారు. 
 
ఈ అత్యాచానికి పాల్పడిన యువకుడు విజయనగరానికి చెందిన వాడేనని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న అందరిపైనా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ భార్య తన భర్తను మరో మహిళతో పంచుకోవాలని కోరుకోదు : అలహాబాద్ హైకోర్టు