ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశం మరోమారు తెరపైకి వచ్చింది. రాజధానే అమరావతి అంటూ ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. అయితే, ఏపీ సర్కారు మాత్రం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ పాలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.
అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొంటూ రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరుగనుంది.
రైతుల తరపున ఉన్నం మురళీధర్ అనే న్యాయవాది హాజరుకానున్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. నిధులు లేవనే సాకుతో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తుందని ప్రధానంగా ప్రస్తావించారు.