కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేయకపోవడంతో ఆందోళనలకు దిగారు.
ఈ క్రమంలో ఈ వ్యవహారం ఇపుడు మహిళా కమిషన్ వరకు చేరింది. మహిళా కమిషన్‌ను కలిసిన మాజీ మంత్రి గీతా రెడ్డి, రేణుకా చౌదరిలు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొన్న మూర్ఖుడు అస్సాం సీఎం హేమంత్ బిస్వా శర్మా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వారు వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి అడిగితే రాహుల్ తండ్రి ఎవరిని అడుగుతారా? ఇంత చమైన కామెంట్స్ చేసిన రాహుల్ గాంధీ పల్లెత్తు మాట అనలేదని వారు గుర్తుచేశారు.