Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసోం, అరుణాచల ప్రదేశ్‌లకు మరో ముప్పు!

Webdunia
సోమవారం, 13 జులై 2020 (09:42 IST)
ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన అసోం, అరుణాచల ప్రదేశ్‌లకు మరో ముప్పు పొంచివుంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బ్రహ్మపుత్రా నది పొంగి పొర్లుతూ, ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది.

మరోవైపు ఆదివారం నాడు కూడా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతమంతా భారీ వర్షం కురిసింది. దీంతో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ రెండు రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని పేర్కొంది.

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అసోంలో ఇప్పటికే 8 లక్షల మందిపై ప్రభావం చూపాయి. బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు పొంగిప్రవహిస్తున్నాయని, అరుణాచల్‌ప్రదేశ్‌లోని దిబాంగ్‌, సియాంగ్‌ నదులు కూడా ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

బెంగాల్‌, సిక్కింలతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయ్యింది. 16వ తేది వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కోల్‌కత్తాలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments