బ్రదర్‌ అనిల్‌ కు తప్పిన ముప్పు

శనివారం, 15 ఫిబ్రవరి 2020 (14:13 IST)
బ్రదర్‌ అనిల్‌కు తృటిలో ముప్పు తప్పింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది.

అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో బ్రదర్ అనిల్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో బ్రదర్‌ అనిల్‌కుమార్‌తో పాటు గన్‌మెన్లు, డ్రైవర్‌ ఉన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది.

ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను సంఘటనా స్థలానికి వెళ్లారు. తన కారులో బ్రదర్ అనిల్, గన్‌మెన్లను విజయవాడలోని ఎంజే నాయుడు ఆస్పత్రికి తరలించారు.

ప్రథమ చికిత్స అనంతరం అనిల్‌ కుమార్‌ తన పర్యటనకు వెళ్లిపోయారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బాబోయ్... తాగి వాహనం నడుపుతున్నారు