Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ జీవోతో ముప్పు: గవర్నర్ కు ఏపీయుడబ్ల్యూజే వినతి

Advertiesment
ఆ జీవోతో ముప్పు: గవర్నర్ కు ఏపీయుడబ్ల్యూజే వినతి
, గురువారం, 7 నవంబరు 2019 (19:19 IST)
మీడియా స్వేచ్ఛ కి భంగం కలిగించే జీవో 2430ని రద్దు చేయాలన్న డిమాండు విషయంలో రాజ్యంగా పరిరక్షకులు అయిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఏపీయుడబ్ల్యూజే) కోరింది. 
 
ఆమేరకు గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ ని యూనియన్ నేతలు కలసి వినతిపత్రం అందజేశారు.. ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్ కుమార్, ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, చిన్నమధ్యతరహా పత్రిక సంగం అధ్యక్షుడు నల్లి ధర్మారావు, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, తదితరులు గవర్నర్ ని కలిశారు.

తొలుత గవర్నర్ కి జీవో వలన మీడియా స్వేచ్ఛకి ఏ విధమైన ముప్పు ఉందొ యూనియన్ నేతలు వివరించారు. ఈ జీవో విషయం తన దృష్టికి వచ్చిందని పిసిఐ చైర్మన్ కూడా స్పందించటాన్ని కూడా ఈ రోజు పత్రికలలో చూసానని గవర్నర్ యూనియన్ నేతలతో అన్నారు. 

గతంలో2007 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజాశేఖర్ రెడ్డి జీవో 938 ని తీసుకొని వచ్చరని, దానిని అప్పుడు కూడా వ్యతిరేకించడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవోని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారని, జీవోను రద్దు చేయకపోయినా వినియోగించలేదని యూనియన్ నేతలు గవర్నర్ దృష్టి కి తెచ్చారు.

తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవో 2430 చాలా  ప్రమాదకరంగా ఉందని, తక్షణమే ప్రభుత్వం జీవోని ఉపసంహరించుకొనే విధంగా చూడాలని యూనియన్ నేతలు గవర్నర్ ను కోరారు.
 
దేశంలోని జర్నలిస్టుల సంఘాలు, సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రజాస్వామ్య వాదులు, వివిధ రాజకీయ పార్టీలు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారని గవర్నర్ కి తెలిపారు.. ఆమేరకు వివరాలతో కూడిన వినతిపత్రంని గవర్నర్ కి యూనియన్ నేతలు అందజేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధర్మశాలలో ప్రధాని నరేంద్ర మోడీకి యామి గౌతమ్ స్వాగతం