Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధర్మశాలలో ప్రధాని నరేంద్ర మోడీకి యామి గౌతమ్ స్వాగతం

Advertiesment
ధర్మశాలలో ప్రధాని నరేంద్ర మోడీకి యామి గౌతమ్ స్వాగతం
, గురువారం, 7 నవంబరు 2019 (19:07 IST)
రైజింగ్ హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2019 బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన నటి యామి గౌతమ్ నవంబర్ 7 మరియు 8 తేదీలలో జరిగే రెండు రోజుల సదస్సులో పాల్గొనడానికి నిన్న ధర్మశాల చేరుకున్నారు. బిలాస్‌పూర్‌లో తన మూలాలను కలిగి ఉన్న ఈ నటి చండీఘర్‌‌లో పెరిగారు. నటనను వృత్తిగా ఎంచుకున్న యామీ ముంబైలో వుంటున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే, ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. యామి ఈ మధ్యాహ్నం ప్రధానిని కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఇద్దరూ ఆహారాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ మరియు రాష్ట్ర పారిశ్రామిక మంత్రి బిక్రామ్ ఠాకూర్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శవరాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: లోకేష్