Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర డ్రైవర్.. జార్ఖండ్ అమ్మాయి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడి..

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (21:09 IST)
ఓ మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడని ఓ మహిళ కేసు పెట్టింది. అయితే ఆ మహిళ తాగి ఉందని, తన స్టాప్ వచ్చాక కూడా దిగకుండా ఉంటే తాను సాయం చేశానని డైవర్ చెప్తున్నాడు. ఈ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌కు చెందిన ఓ మహిళ బెంగుళూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తూ పెయిడ్ గెస్ట్‌గా మురుగేశ్ పాళ్యలో నివసిస్తోంది. ఆమె మంగళవారం రాత్రి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో తన స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వెళ్లింది. అనంతరం తన ఇంటికి వెళ్లేందుకు తెల్లవారుజామున 2 గంటలకు క్యాబ్ బుక్ చేసింది. 
 
అయితే తన ఇంటి సమీపంలోకి వచ్చాక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి డ్రైవర్ తనపై లైంగిక దాడి చేశాడని మహిళ ఆరోపిస్తోంది. అనంతరం నిందితుని ఫోన్‌ను లాక్కుని మహిళ అక్కడి నుంచి తప్పించుకుందని సమాచారం. ఇంటికి చేరుకున్న ఆమె అనంతరం జేసీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయితే.. క్యాబ్ డ్రైవర్ మాత్రం తన క్యాబ్ లో ఎక్కిన మహిళ మద్యం సేవించిందని పేర్కొన్నాడు. ఆమె ఇంటి వద్దకు వచ్చిన తర్వాత కూడా ఆమె దిగకపోతే సాయపడ్డానని దానికి ఆమె తనపై లైంగిక దాడి ఫిర్యాదు చేసిందని నిందితుడు చెప్పినట్టు సమాచారం.
 
దర్యాప్తు చేసిన పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. డ్రైవర్ తన క్యాబ్‌ను దాదాపు 20 నిమిషాల పాటు ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచినట్టు గుర్తించారు. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ.. బాధిత మహిళ క్యాబ్‌ ఎక్కగానే నిద్రపోయిందని.. దీనిని అదనుగా తీసుకున్న డ్రైవర్ క్యాబ్ ను ఆమె ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం