Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజృంభిస్తున్న ఒమిక్రాన్ వైరస్ - పంజాబ్‌లో విద్యా సంస్థల మూసివేత

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (15:39 IST)
దేశంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. గడిచిన 24 గంటల్లో కూడా ఏకంగా 35 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇపుడు పంజాబ్ రాష్ట్రం కూడా కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ముఖ్యంగా, రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలను మూసివేయాలని ఆదేశించింది. 
 
అలాగే, క్రీడా ప్రాంగణాలు, ఈతకొలనులు, వ్యాయామశాలను పూర్తిగా వేయాలని ఆదేశించింది. రాత్రి 10 గంటల నుంచి 5గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూను విధించింది. అయితే, విద్యా సంస్థలు మూసివేసిన దరిమిలా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. 
 
ఇకపోతే, మల్టీప్లెక్స్‌లో, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, మద్యంబార్లు, షాపింగ్ మాల్స్, స్పాలు, జంతు ప్రదర్శనశాలలు, మ్యూజియం‌లను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించాలని పంజాబ్ సర్కారు మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా : పరుచూరి గోపాలక్రిష్ణ

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

'పుష్ప-2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ సక్సస్సేనా?

పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

తర్వాతి కథనం
Show comments