Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ పత్రాలు సృష్టి - మోసం కేసులో 383 యేళ్ల జైలుశిక్ష .. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (12:17 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చేరన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌లో జరిగిన ఓ మోసంతో నకిలీ పత్రాల మోసం కేసులో దోషిగా తేలిన ఆ సంస్థకు చెందిన ఓ వ్యక్తికి కోర్టు 383 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, రూ.3.32 కోట్ల జరిమానా విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ రవాణా సంస్థ కోయంబత్తూరు డివిజన్‌లో బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ గత 1988లో నవంబరు ఎనిమిదో తేదీన ఒక కేసు నమోదైంది. 
 
నకిలీ పత్రాలతో 47 బస్సులను విక్రయించి రూ.28 లక్షల మోసం చేశారంటూ ఎనిమిది మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోదండపాణి, రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైస్వామి, రంగనాథన్, రాజేంద్రన్‌లను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో కోర్టులో విచారణ సాగుతూ వస్తుంది. ఈ క్రమంలో కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నటరాజన్, రామచంద్రన్, రంగనాథన్, రాజేంద్రన్‌లు చనిపోయారు.
 
మరోవైపు జీవించివున్నవారిలో కోదండపాణి మినహా మిగిలిన ముగ్గురినీ జడ్జి నిర్దోషులుగా పేర్కొనగా, ఆర్టీసీ సంస్థను మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాల కింద నాలుగేళ్ల చొప్పున 188 యేళ్లు, 47 ఫోర్జరీ నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 యేళ్ళు ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. ఈ మూడు శిక్షలను కలిపితే మొత్తం 383 సంపత్సరాల శిక్ష అవుతుంది. ప్రస్తుతం కోదండపాణి వయసు 82 సంవత్సరాలు. కోర్టు తీర్పు నేపథ్యంలో ముద్దాయిని పోలీసులు జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments