Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇస్రో పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధం

Advertiesment
PSLV-C56
, శనివారం, 29 జులై 2023 (17:17 IST)
PSLV-C56
ఇస్రో పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం ఈ ప్రయోగానికి సర్వం సిద్ధం అయ్యింది. ఈ వాణిజ్యపరమైన రాకెట్ ప్రయోగం ద్వారా సింగపూర్ కు చెందిన 7 శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యల్లోకి పంపించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో, ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.  పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలని స్వామివారిని ప్రార్థించారు. 
 
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ప్రయోగం జూలై 30 (ఆదివారం) ఉదయం 06.30 గంటలకు రోదసీలోకి ఈ రాకెట్ దూసుకెళ్లనుంది. వెలాక్స్ AM, ARCADE, SCOOT - టూ, నులియన్, గెలాసియా - టూ, ORB - ట్వెల్వ్ ఉపగ్రహాలను ఈ రాకెట్ మోసుకెళ్లనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాముకాటుకు గురై మూడేళ్ల చిన్నారి మృతి