Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో అక్రమ సంబంధం: రాజకీయ నాయకుడి దారుణ హత్య

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (17:37 IST)
ఈమధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి సంబంధాల విషయంలో కొన్నిసార్లు ఎలాంటి కేసులు కూడా నమోదు చేసే వీలు లేకపోవడంతో నేరాల సంఖ్య అధికమవుతున్నాయి. ముఖ్యంగా ఓ మహిళ, పురుషుడు ఇష్టపడి సంబంధం నెరపితే తప్పేమీ లేదని పలు కేసుల్లో వెల్లడి కావడంతో యధేచ్చగా అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతోంది.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఓ రాజకీయ నాయకుడు ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి, అవతలి వ్యక్తి పొలిటీషియన్ కావడంతో ఏమీ చేయలేక భార్యను మందలించాడు. ఐనప్పటికీ వారిలో మార్పు రాలేదు. ఆ సంబంధం అలానే సాగించారు. దీనితో తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోయిన మహిళ భర్త పక్కా ప్రణాళికతో తన భార్యతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్న రాజకీయ నాయకుడుని హత్య చేసి ముక్కల కింద నరికి గోనె సంచుల్లో కుక్కి అక్కడక్కడ విసిరేశారు.
 
ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. హత్య గావింపబడ్డ నాయకుడు సీపీఎం నేత సుభాష్ చంద్రదేవ్. ఇతడు గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి చివరికి సోమవారం నాడు అతడి మృతదేహం భాగాలు కనుగొని దర్యాప్తు చేపట్టారు. హతుడు కాల్ లిస్ట్ చూడగా మహిళతో జరిగిన సంభాషణను బట్టి ఆమెతో అతడు వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్నట్లు కనుగొన్నారు. దీంతో సదరు మహిళతో పాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అతడిని తనే చంపినట్లు మహిళ భర్త అంగీకరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments