Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోట్ల ఆస్తి చూసి ప్రేమించాడు, ప్రియురాలికి పెళ్ళయిపోయిందన్న ఆగ్రహంతో అది చేస్తూ..

Advertiesment
girlfriend
, గురువారం, 17 అక్టోబరు 2019 (12:43 IST)
గాఢంగా ప్రేమించానన్నాడు. నువ్వు లేనిదే బతుకే లేదన్నాడు. పెళ్ళంటూ చేసుకుంటూ నిన్ను తప్ప ఇంకెవరినీ చేసుకోనన్నాడు. దీంతో ప్రియుడిని నమ్మింది. సర్వస్వం అర్పించింది. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్ళిని మాత్రం ఆమె వద్దని చెప్పలేకపోయింది. ఇంకేముంది ఆమెకు పెళ్ళయింది.. ఇప్పుడే అసలు కథ మొదలైంది.
 
హైదరాబాద్ రామాంత్ పూర్ సమీపంలోని గాంధీపురం చౌరస్తా. అమ్మాయి పేరు నిషిత. బి.టెక్ పూర్తి చేసింది. తండ్రి పారిశ్రామికవేత్త. ఉప్పల్ పారిశ్రామికవాడలో 8కి పైగా పరిశ్రమలను నడుపుతుండేవాడు. బాగా డబ్బున్న కుటుంబం. నిషిత ఇంటి పక్కనే రవీంద్ర ఉండేవాడు. ఆమె ఆస్తిని చూసి ఆమెకు దగ్గరవ్వాలనుకుని నిర్ణయించుకున్నాడు. మాయమాటలు చెప్పి బాగా దగ్గరయ్యాడు. 
 
ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ విషయం నిషిత కుటుంబ సభ్యులకు తెలియకపోయినా తమ తాహతకు తగ్గట్లు నిషిత తండ్రి అనురాగ్ అనే ఒక వ్యక్తితో నిషితకు పెళ్ళి నిశ్చయం చేశాడు. తండ్రి మాటను కాదనలేక అనురాగ్‌ను పెళ్ళి చేసుకుంది నిషిత. పెళ్ళయి 6 నెలలయ్యింది. తనను మర్చిపోవాలనీ, తనకు వేరే వివాహమైందని చెప్పింది.
 
అలా ప్రియుడ్ని మెల్లగా మర్చిపోయింది నిషిత. కానీ రవీంద్ర మాత్రం ఆమెను మర్చిపోలేదు. ఆస్తితో పాటు ఆమె దూరమైపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆమె దగ్గర డబ్బులు ఎలాగైనా లాగాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉండే నిషితను అప్పుడప్పుడు కలిసేవాడు.
 
రెండురోజుల క్రితం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా వెళ్ళాడు. ఆమె బీరువాలోని డబ్బులు, నగలును ఎత్తుకుని వెళ్ళేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె అడ్డుకుంది. ఎందుకిలా చేస్తున్నావంటూ ప్రశ్నించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెను చున్నీతో గొంతు నులిమి చంపేసి పరారయ్యాడు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సి.సి.కెమెరాలో నిక్షిప్తమైన ఆధారాలతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ హౌస్ నుంచి మహేష్ బయటకొచ్చి నాగ్ గురించి ఎందుకలా మాట్లాడాడు?