Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరత్న ఆయిల్ ఎలా రాశారు శకునిమామా? బుద్ధా వెంకన్న సెటైర్లు

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (16:42 IST)
వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. గత కొన్ని రోజులుగా వీరిద్ధరి మధ్య ట్విట్టర్ వార్ సాగుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బుద్ధా వెంకన్న మరోమారు వరుస ట్వీట్ల్ చేశారు. 
 
'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే ప్రజలకు నవరత్న తైలం రాసారా శకుని మామా?' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలిపిస్తే మోడీ మెడలు వంచుతాం, కేంద్రాని కడిగి పారేసి రాష్ట్ర ఖజానా నింపుతామని నువ్వు, మీ తుగ్లక్ అన్నారుగా! తీరా మీకు 22 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్ర హక్కుల కోసం పోరాడకుండా, కేసుల మాఫీ కోసం ఏపీ హక్కుల్ని తాకట్టుట్టు పెట్టేశారు కదా శకుని మామా! దానికితోడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితీ, అప్పులూ అంటూ మంగళారం కబుర్లొకటి!' అంటూ సెటైర్ వేశారు.
 
అంతేకాకుండా, మడమ తిప్పాం, మాట తప్పాం అని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, "మహామేత హయాంలో చేసిన అప్పులు, చంద్రబాబు సృష్టించిన సంపదపై నేను చర్చకు సిద్ధం, మరి నువ్వు సిద్ధమా శకుని మామా?" అంటూ సవాల్ విసిరారు. అలాగే, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు తెలియకుండానే రాష్ట్ర ప్రజలకు నవరత్న ఆయిల్ రాశారా శకునిమామా అంటూ నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments