Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్క్రిప్ట్ మార్చు శకుని మామా.... బిల్డప్ ఎందుకు? బుద్ధా వెంకన్న

Advertiesment
Tdp Leader
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (16:03 IST)
గతంలో రాసిన స్క్రిప్ట్‌తో ఐఏఎస్ అధికారులని కూడా జైల్లో కూర్చోబెట్టావ్. రివర్స్ టెండరింగ్, ఎలక్ట్రిక్ బస్సులు, భూ సర్వే కోసం కొత్త టెక్నాలజీ అంటూ సంతకాలు పెట్టమంటే అమాయకంగా సంతకాలు పెట్టి జైలుకి వెళ్లడానికి అధికారులు సిద్ధంగా లేరు ఇంకా నీకు అర్ధం కాలేదా? నీ బదిలీలలు త్వరలోనే బయటకి వస్తాయి.

కిలోమీటర్ల లెక్కన నొక్కేసే ప్రతి రూపాయికి లెక్క రాసుకో ఎందుకంటే తిరిగి ఇచ్చేయాలి కదా లేకపోతే లావైపోతావు అంటూ వైకాపా నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. 
 
రాష్ట్ర సరిహద్దులు కూడా చెరిపేసి కవల పిల్లలు గాలి, జగ్గు చేసిన మైనింగ్ గురించి మర్చిపోయావా శకుని మామా..?
ఎలా మర్చిపోతావ్ లే లెక్క రాసింది నువ్వేగా. అన్నట్టు బాక్సైట్ మైనింగ్ అంటున్నావ్ ఏంటి? 2007 మహానేత విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వుకొని దోచుకోవడానికి రస్ అల్ ఖైమా కంపెనీ పేరుతో అనుమతులు ఇచ్చారు దాని గురించేనా.? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
తండ్రి ఇచ్చిన అనుమతులు కొడుకు రద్దు చేసాడు అని బిల్డ్ అప్ ఎందుకు శకుని మామా...? అనుమతులు ఇప్పించినందుకే 1700 కోట్లు అప్పట్లో మీరు కొట్టేసారు కదా మర్చిపోయావా? పాత పద్దుల పుస్తకం తిరగేయ్ బాక్సైట్ లెక్క ఉంటుంది. పుస్తకాలు కాల్చేస్తే లెక్క సీబీఐ దగ్గర దొరుకుతుంది ఒక్క సారి అడిగి చూడు.. అంటూ తీవ్రస్థాయిలో బుద్ధా వెంకన్న ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి కొత్తగా రెండు ఓడరేవులు.. జల మార్గాల ద్వారా ఖర్చు తక్కువ