Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ కు తాజాగా మరో కొత్త సర్విస్!

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (09:07 IST)
భారతదేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్‌, చిరునామా గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నాయి.

ఒక బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు తీసుకోవాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి. కొద్దీ రోజుల క్రితం ఎస్‌బీఐ ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఎవరి ఖాతాలకు ఆధార్ కార్డు లింక్ చేయలేదో వెంటనే లింక్ చేసుకోవాలని ఖాతాదారులను ఎస్‌బీఐ కోరింది.

ఈ కరోనా మహమ్మరి సమయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త కొత్త సేవలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది.  
 
తాజాగా మరో కొత్త సర్విస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సర్విస్ ప్రకారం పౌరులు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేశారో ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అయిందో కూడా తెలుసుకోవచ్చు.

ఇందుకోసం యూఐడీఏఐ(https://uidai.gov.in/) వెబ్‌సైట్ లో ప్రత్యేకంగా ఓ లింక్ అందుబాటులో ఉంచింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిందో క్షణాల్లో తెలుసుకోవచ్చు.
 
ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ స్టేటస్: 
 
* ముందుగా యూఐడిఏఐ https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
 
* తర్వాత హోమ్ పేజీలో 'ఆధార్ సర్వీసెస్' పైన క్లిక్ చేయాలి.
 
* ఇప్పుడు మీకు కనిపించే "ఆధార్ లింకింగ్ స్టేటస్" పైన క్లిక్ చేయాలి.
 
* ఆ తర్వాత ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
 
* ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి "సెండ్ ఓటీపీ" పైన క్లిక్ చేయాలి.
 
* ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
 
* మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి "సబ్మిట్" పైన క్లిక్ చేయాలి.
 
* ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.
 
అందులో మీరు ఎప్పుడు బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేశారో చూపించడంతో పాటు బ్యాంక్ లింకింగ్ స్టేటస్ యాక్టీవ్‌గా ఉందో లేదో కూడా తెలుస్తుంది.

మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో తెలుసుకోవడానికి కచ్చితంగా మీ ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే ఈ వివరాలు తెలుసుకోలేము.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments