Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్‌ ముందస్తు రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదు

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (09:04 IST)
వ్యాక్సిన్‌ కోసం ముందుగా ఎవరూ రిజిస్టర్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. 18 ఏళ్లు దాటినవారెవరైనా దగ్గర్లోని వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లి అప్పటికప్పుడు కొవిన్‌ యాప్‌లో నమోదు చేసి వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని తెలిపింది.

ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. టీకా కోసం ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం వల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు కేంద్రం దృష్టికి రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మరోవైపు దేశంలో వ్యాక్సిన్‌పై అనుమానాలతో చాలా ప్రాంతాల్లో టీకా వేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని, దీనిపై శాస్త్రీయ విధానం ద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు ‘ కొవిడ్‌ 19 వ్యాక్సినేషన్ కమ్యూనికేషన్‌ స్ట్రాటజీ’ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకుంది.
 
కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లోనూ వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. దేశ వ్యాప్తంగా తాజాగా జరిగిన రెండు ఘటనలే ఇందుకు నిదర్శనం. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఓ వృద్ధురాలు వ్యాక్సిన్‌ వేయించుకోకుండా ఓ నీళ్ల డ్రమ్ము వెనుక ఉండిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments