Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధ దంపతులను డబ్బు కోసం చంపేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (14:34 IST)
తల్లీ కొడుకులు కలిసి డబ్బు కోసం వృద్ధ దంపతులను కిరాతకంగా హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో వీరేందర్ కూమార్ ఖనేజా (77), సరళ (72) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. 
 
వారి ఇంట్లో పనిచేస్తున్న మహిళ, ఆమె కుమారుడు ఇద్దరూ కలిసి వారిని దారుణంగా చంపి 9 లక్షల నగదును, బంగారు ఆభరణాలను చోరీ చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈనెల 26వ తేదీన ఆ వృద్ధ దంపతులు కనిపించడం లేదని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వారి ఫ్లాట్‌ను బలవంతంగా తెరిచి చూసారు, అక్కడ ఇద్దరూ శవాలుగా కనిపించారు.
 
దుండగులు ఫ్లాట్ లోపలి వైపు తాళం వేసి దంపతుల ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసారు. బాధితుల కుమారుడు డాక్టర్‌ అమిత్‌ ఖనేజా అమెరికాలో నివసిస్తున్నాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వారి ఇంట్లో పనిచేసే మహిళను తమదైన రీతిలో విచారణ చేయగా అసలు విషయం బయటపెట్టింది. డబ్బు కోసమే ఈ పనికి పాల్పడినట్లు ఒప్పుకుంది.
 
జనవరి 18న వీరేందర్‌ ఖనేజా లాకర్‌లో డబ్బును ఉంచడం గమనించిన నిందితురాలు అదే రోజు మధ్యాహ్నం వీరేందర్ బయటకు వెళ్లగానే తమ కుమారుడితో కలిసి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు సమాచారం అందించారు. వారి నుండి 9 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram gopal varma: పుష్కరాల్లో తొక్కిసలాట భక్తులు చనిపోతే.. దేవతలను అరెస్టు చేస్తారా?

Pawan Kalyan: హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. నమ్మలేకపోతున్నానన్న రష్మిక

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్‌నే ఎలా బాధ్యులను చేస్తారు? నాని ప్రశ్న

డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు దినం పట్ల మనవరాళ్ళు రేవతి, అనురాధ హర్షం

వెంకటేష్ బర్త్‌డే - సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ సింగిల్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments