Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సుపై డాక్టర్ లైంగిక దాడి... మెడికల్ షాప్ ఓనర్ వీడియో తీసి...

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (13:23 IST)
కామాంధులకు వయసుతో సంబంధం లేదు. తన కుమార్తె వయసున్న ఓ యువతిపై ఓ వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన వద్ద నర్సుగా పనిచేస్తున్న యువతిని బెదిరించి లొంగదీసుకుని ఆమెపై గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే... ముంబై శివారు కల్యాణ్ ప్రాంతంలో అన్సారీ అనే డాక్టర్ వైద్యాలయాన్ని నడుపుతున్నాడు. కుటుంబ భారం తనపై పడటంతో మైనర్ బాలిక ఆ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. 
 
తొలుత పెద్దగా పట్టనట్లు వున్న అన్సారీ ఆ తర్వాత మెల్లిగా తన కోర్కె తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ప్రతిఘటించగా ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఉద్యోగం పోతే తనపై ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబ సభ్యుల జీవితం చెల్లాచెదురవుతుందని, ఆమె లొంగిపోయింది. దీనితో వైద్యుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో పక్కనే వున్న మందుల షాపు ఓనర్ దిల్షాద్ ఓ రోజు ఈ ఘటనను వీడియోలో బంధించాడు. 
 
ఆ తర్వాత ఆ వీడియో తీసి తన కోర్కె తీర్చకపోతే దానిని బయటపెడతానంటూ అతడు కూడా వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు భరించలేని బాధితురాలి విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీనితో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అన్సారీని అరెస్టు చేసి అతడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. మందుల షాపు ఓనర్ పరారీలో వున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం