Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నబిడ్డపై అత్యాచారం.. ఉరేసి హత్య.. కిరాతక తండ్రికి ఉరిశిక్ష

Advertiesment
కన్నబిడ్డపై అత్యాచారం.. ఉరేసి హత్య.. కిరాతక తండ్రికి ఉరిశిక్ష
, మంగళవారం, 25 డిశెంబరు 2018 (13:07 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కన్నకుమార్తె తనకు పుట్టలేదని.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆమెను హతమార్చిన కిరాతక తండ్రికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భోపాల్‌కి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఆరేళ్ల కుమార్తె వుంది. కానీ అతడు ఆ బిడ్డ తనది కాదంటూ భార్యతో తరచూ గొడవపడే వాడు. ఈ క్రమంలో కన్నకూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2017, మార్చి 15వ తేదీన అర్థరాత్రి బాలికను ఉరేసి హత్యకు పాల్పడ్డాడు. 
 
కానీ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ పాప నిందితుడి బిడ్డేనని తేలింది. ఇంకా అతడే ఆ బాలికను హత్య చేశాడని తేలడంతో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అతనికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో ఎఫెక్ట్.. వొడాఫోన్ నుంచి రూ.329 పేరిట కొత్త ప్లాన్