Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మార్ట్‌ఫోన్ ఇస్తాను.. గేమ్ ఆడుకోమని అత్యాచారానికి పాల్పడ్డాడు..

స్మార్ట్‌ఫోన్ ఇస్తాను.. గేమ్ ఆడుకోమని అత్యాచారానికి పాల్పడ్డాడు..
, సోమవారం, 24 డిశెంబరు 2018 (12:38 IST)
చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు వయోభేదం లేకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా స్మార్ట్‌ఫోన్ ఇచ్చి గేమ్ ఆడుకోమని ఆశ చూపి ఓ యువకుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ సనత్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన ఇంజమామ్ (19) అనే యువకుడు కుటుంబంతో పాటు హైదరాబాదుకు వచ్చారు. 
 
సనత్ నగర్లో స్థిరపడిన ఇంజమామ్ కుటుంబంతో మరో బీహార్ కుటుంబం సన్నిహితంగా వుండేది. ఆ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల బాలికపై ఇంజమామ్ కన్నేశాడు. శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గేమ్స్ ఆడుకునేందుకు స్మార్ట్‌ఫోన్ ఇస్తానని ఆశచూపిన ఇంజమామ్ బాలికను ఇంటికి రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అయితే ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమలకు వెళ్లిన ఇద్దరు మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు..