Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

ఠాగూర్
ఆదివారం, 19 మే 2024 (13:13 IST)
బీహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ సరదా నలుగురు ప్రాణాలు తీసింది. ఈ ఘటన రాష్ట్రంలోని ఖగారియా జిల్లో సంభవించింది. గంగానదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదవశాత్తూ ఆరుగురు యువకులు నీటిలో మునిగారు. వీరిలో నలుగురు యువకులు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. జిల్లాలోని పర్చట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అగువాని ఘాట్ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. 
 
మైనర్ యువతితో సహా ఆరుగురు రీల్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరిని స్థానికులు రక్షించగలిగారని చెప్పారు. నీటిలో మునిగిన నలుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్వేషించినా ఆచూకీ దొరకలేదని వివరించారు. నీటి ప్రవాహ ఉధృతిని పసిగట్టలేకపోయారని, ప్రమాదాన్ని గుర్తించక రీల్స్ షూట్ చేసేందుకు నీటిలోకి దిగారని పర్చట్టా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు. 
 
మునిగిపోయినవారి ఆచూకీ కోసం స్థానిక ఈతగాళ్లతో ఎసీడీఆర్ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోందని ఆయన వివరించారు. చనిపోయినవారి పేర్లు నిఖిల్ కుమార్ (23), ఆదిత్య కుమార్ (18), రాజన్ కుమార్ (16), శుభం కుమార్ (16)గా వెల్లడించారు. శ్యామ్ కుమార్ (24) అనే యువకుడితో పాటు అతడి సోదరి సాక్షి కుమారి (16) ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments