Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

సెల్వి

, సోమవారం, 13 మే 2024 (18:52 IST)
గంగా నది పవిత్రమైనది. గంగాపూజకు ప్రతి ఏటా జరుపుకునే గంగా సప్తమి ఉన్నతమైంది. భక్తులు గంగా దేవిని గౌరవించే రోజును గంగా సప్తమిగా పిలుస్తారు. ఈ రోజున గంగాదేవి భక్తులను ఆశీర్వదించడానికి భూమిపైకి దిగుతుందని నమ్ముతారు. వైశాఖంలో శుక్ల పక్షంలోని సప్తమి తిథి నాడు గంగమ్మ తల్లిని పూజిస్తారు. తేదీ మరియు పూజ సమయాలు: పంచాంగ్ ప్రకారం, 2024లో గంగా సప్తమి మే 14న జరుపుకుంటారు. 
 
ఈ రోజున గంగా నదిలోని పవిత్ర జలాల్లో తెల్లవారుజామున స్నానం చేసి భక్తులు పూజలు ప్రారంభిస్తారు. గంగమ్మకు నూనె దీపాలను వెలిగిస్తారు. వాటిని గంగా దేవికి నైవేద్యంగా నది ఉపరితలం వెంట తేలడానికి అనుమతిస్తారు.
 
అమ్మవారిని గౌరవించటానికి పూలమాలలు, స్వీట్లు సమర్పించబడతాయి, సాయంత్రం గంగాదేవి  ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. దీప్ దాన్ అని పిలువబడే ఒక ముఖ్యమైన ఆచారం ఇది. సాయంత్రం వేళల్లో దేవతకు దీపాలను సమర్పించడం అని దీని అర్థం.
 
అదనంగా, పేదలకు ఆహారం, నీరు, దుస్తులు దానం చేయడం మంచిది. ఈ రోజున భక్తులు తరచూ పంచాక్షరి మంత్రం, మహా మృత్యుంజయ మంత్రం వంటి పవిత్ర మంత్రాలను పఠించడంలో నిమగ్నమై నదీతీరంలో కూర్చొని ధ్యానం చేయడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. 
 
ఇంకా ఇంట్లోని గంగాదేవిని తలచి దీపారాధన చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా సమీపంలోని సరస్సు, కొలనుల్లో గంగాదేవిని తలచి దీపాలను వెలిగించడం మంచి ఫలితాలను ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...