Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవాలో ఆది సాయి కుమార్ 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ మ్యూజిక్ సిట్టింగ్స్

Advertiesment
Veerabhadram Chaudhary and team

డీవీ

, బుధవారం, 8 మే 2024 (16:18 IST)
Veerabhadram Chaudhary and team
లవ్ లీ యంగ్ హీరో ఆది సాయి కుమార్ త్వరలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చుట్టలబ్బాయ్‌ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో ఉన్న సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వీరభద్రమ్ చౌదరి - ఆది సాయి కుమార్ కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ప్రకటించారు. 
 
ప్రస్తుతం ఈ చిత్ర సంగీతం పనులు జరుగుతున్నాయి. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఆది సాయి కుమార్, దర్శకుడు వీరభద్రమ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గోవా వెళ్లారు. గతంలో ఆది సాయి కుమార్ నటించిన లవ్ లీ, ప్రేమ కావాలి, సుకుమారుడు.. లాంటి సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ ఇప్పుడు ఈ 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ సినిమాకు మరోసారి అద్భుతమైన సంగీతాన్ని, పాటలను రెడీ చేస్తున్నారు. 
 
జూన్ నుంచి 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. గతంలో ఆదితో కలిసి క్రేజీ ఫెలో సినిమాలో నటించిన దిగంగన సూర్యవంశీ ఈ చిత్రంలో మళ్ళీ ఆదితో కలిసి అలరించనుంది. ఇక ఈ సినిమాకి శ్యామ్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. రాము మన్నార్ అద్భుతమైన డైలాగ్స్ రాస్తున్నారు. డ్రాగన్ ప్రకాష్, శంకర్ యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేస్తున్నారు.          
 
నటీనటులు : ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మురళీధర్ గౌడ్, 30 ఇయర్స్ పృధ్వీ, రఘు బాబు, అవినాష్, రచ్చ రవి, అశ్విని, శ్రీ దేవి, అలేక్య, స్నేహ, పద్మ, గిరిధర్, గోవర్ధన్, మాస్టర్ రిత్విక్, వెంకట్ నారాయణ, గురు రాజ్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్న విజయ్ దేవరకొండ