Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు... ఇద్దరు వ్యక్తుల మృతి

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (09:12 IST)
గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైలును ఆపేందుకు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కొడెర్మా జిల్లాలో జరిగింది. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, పర్సాబాద్ సమీపంలోని పూరి నుంచి ఢిల్లీ వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్‌పై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇది గుర్తించిన లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. 
 
ఆ సమయంలో రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నది. డ్రైవర్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ క్రమంలో భారీ కుదుపునకు లోనై ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన నాలుగు గంటల తర్వాత రైలు మరో ఇంజిన్ సాయంతో గోమా రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడ బోగీలకు మరో ఎలక్ట్రిక్ ఇంజిన్ జత చేసి గమ్యస్థానానికి పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments