Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మందుల పేరుతో నమ్మించి... బాలికపై మైనర్ల అత్యాచారం

Webdunia
శనివారం, 4 జులై 2020 (17:08 IST)
కరోనా మందులు ఇప్పిస్తామని ఓ బాలికను నమ్మించి.... తమ వెంట తీసుకెళ్లిన ఇద్దరు బాలురు... సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికకు కొవిడ్-19 పాజిటివ్ అని చెప్పి, ఈ వైరస్‌ను నయం చేయడానికి తాము సమీపంలోని ఆసుపత్రి నుంచి మందులు ఇప్పిస్తామని ఇద్దరు మైనర్ యువకులు నమ్మించారు. దీంతో ఆ బాలిక వారి మాటలు నమ్మింది. ఆ తర్వాత వారు ఆ బాలికను తమ వెంట నిర్మానుష్యం ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత ఆ దుండగుల చెర నుంచి బయటపడిన ఆ బాలిక.. ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తనను బయటకు తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు తనపై అత్యాచారం చేశారని బాలిక తల్లిదండ్రులకు చెప్పిందని, దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేర తాము పోస్కో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నిందితుల్లో ఓ బాలుడిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో బాలుడు కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments