Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో ఘోరం- 17ఏళ్ల బాలికపై ఏడుగురు వ్యక్తుల అత్యాచారం..

పుదుచ్చేరిలో ఘోరం జరిగింది. చెన్నై ఘటన తరహాలో ఓ బాలికపై ఏడుగురు వ్యక్తులు ఇంట్లో నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి రెడ్డియార్‌పాళయం ప్రాంతానికి చెందిన బాలి

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (11:11 IST)
పుదుచ్చేరిలో ఘోరం జరిగింది. చెన్నై ఘటన తరహాలో ఓ బాలికపై ఏడుగురు వ్యక్తులు ఇంట్లో నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి రెడ్డియార్‌పాళయం ప్రాంతానికి చెందిన బాలిక (17) స్థానికంగా ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తోంది.


ప్రతి రోజు బస్సులో రాకపోకలు సాగించేది. వలుదావూర్‌ ప్రాంతానికి ఓ యువకుడు పరిచయం చేసుకుని, ప్రేమిస్తున్నట్లు ఆమెను నమ్మించాడు. కొన్ని రోజుల క్రితం ఆ బాలికను ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సెల్‌ఫోనులో చిత్రీకరించాడు. 
 
ఆ వీడియోతో ఆమెను బెదిరిస్తూ లొంగదీసుకునేవాడు. అనంతరం ఓ ఇంట్లో బంధించి తన ఆరుగురు స్నేహితులను పిలిచాడు. వాళ్లు కూడా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా చిత్రహింసలకు గురిచేశారు. అక్కడి నుంచి బయటపడ్డ బాలిక బంధువుల సాయంతో బాలల సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేశారు.

కమిటీ ఛైర్మన్‌ రాజేంద్రన్‌, సభ్యులు ఆ బాలికను విచారించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుక్కనూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments