Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పెళ్లి.. కాపురానికి పంపని తండ్రి.. విషంతాగి మహిళ ఆత్మహత్య

తమిళనాడులో మహిళలకు రక్షణ కరువైంది. మొన్నటికి మొన్న దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రేమించి వివాహం చేసుకున్న నెల రోజులకే ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (10:38 IST)
తమిళనాడులో మహిళలకు రక్షణ కరువైంది. మొన్నటికి మొన్న దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రేమించి వివాహం చేసుకున్న నెల రోజులకే ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా స్వామిమలై సమీపం అన్నానగర్‌‌లో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే అన్నానగర్‌కు చెందిన నీలమేఘం కుమార్తె అనసూయ (24) బీటెక్‌ చదివి ఇంటివద్దే ఉంటోంది. వీరి ఎదురింటికి చెందిన సెల్వరాజ్‌ కుమారుడు పుగళేంది కేబుల్‌ టీవీలో పని చేస్తున్నాడు. పుగళేంది, అనసూయ మధ్య ప్రేమ చిగురించింది. నెలక్రితమే వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరి వివాహం గురించి ఇరువురి ఇళ్లలో తెలిసింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పంచాయితీ పెద్దలు కూడా వీరి వివాహం సరైనదేనని తీర్పు చెప్పారు. 
 
అయితే ఈ పెళ్లి అనసూయ తండ్రి నీలమేఘంకు నచ్చలేదు. దీంతో కుమర్తెను కాపురానికి పంపించలేదు. పైగా పుగళేంది కుటుంబసభ్యులు కూడా ఈ విషయంపై పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన అనసూయ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments