Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాటింగ్ వద్దన్న తమ్ముడిని ఇయర్‌ఫోన్ వైరుతో చంపేసిన మైనర్ అక్క.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (12:45 IST)
వారిద్దరూ మైరర్లే. అయితే, తనకంటే రెండేళ్లు పెద్దదైన అక్క ఓ యువకుడితో ప్రేమలో పడింది. నిత్యం అతనితో మొబైల్‌లో చాటింగ్ చేస్తూ గడిపేది. దీంతో ఆగ్రహించిన తమ్ముడు... ప్రియుడితో చాటింగ్ చేయొద్దని వారించారు. ఇది మైనర్ అయిన అక్కకు ఆగ్రహం తెప్పించింది. అంతే.. తమ్ముడు అని కూడా చూడకుండా తమ్ముడిని అక్క(మైనర్‌ బాలిక)అమానుషంగా హత్య చేసింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలకు చెందిన 15 యేళ్ల బాలిక, 9 యేళ్ల బాలుడు ఉన్నారు. వీరిద్దరూ అక్కా తమ్ముడు. తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో బాయ్‌ ఫ్రెండ్‌తో అక్క ఫోన్‌లో చాట్ చేయడంపై తమ్ముడు అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. గంటలు గంటలు ఫోన్‌ ఎందుకు మాట్లాడతావంటూ గతంలో చాలాసార్లు అక్కను ప్రశ్నించాడు. 
 
ఇదే విషయాన్ని అమ్మానాన్నకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతోవారు బాలికను మందలించారు. అయితే తాజాగా అదే తరహాలో ఫోన్‌లోమాట్లాడటం గుర్తించి వారించాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో అక్కపై దాడి చేశాడు. దీంతో ఆవేశంతో  ఊగిపోయిన బాలిక ఇయర్‌‌ ఫోన్స్‌ కేబుల్‌ను అతడి మెడకు బిగించడంతో ఊపరాడక చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గుట్టుగా స్టోర్‌ రూంలో దాచి పెట్టి, ఏమీ తెలియనట్టుగా నటించింది.
 
అయితే పిల్లవాడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి తండ్రి పొరుగువారిపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులను కూడా ఆరా తీయాలని భావించారు. మరుసటి రోజు, దుర్వాసన రావడంతో స్టోర్‌ రూం తెరిచి కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. చివరికి పోలీసుల విచారణలో బాలిక తన నేరాన్ని అంగీకరించింది.  స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి అరెస్టు చేసి జువైనల్‌ హోంకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments