Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 పెళ్లిళ్లు, శోభనం గది నుంచి పారిపోయి 14వ పెళ్ళి చేసుకుంటూ వుండగా?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (17:18 IST)
పెళ్ళి అంటే జీవితంలో ఒకేసారి వచ్చే అద్భుత ఘట్టం. కాబోయే భర్తతో జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటారు అమ్మాయిలు. కానీ కొంతమంది డబ్బు కోసం వివాహ బంధాన్ని వాడుకుంటూ ఉన్నారు. సరిగ్గా 21 యేళ్ళు కూడా లేని యువతి ఏకంగా 13 మందిని వివాహం చేసుకుంది. మరొకరిని పెళ్ళాడేందుకు సిద్థమైంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
 
ఆమె ఓ నిత్యపెళ్ళి కూతురు. 21 యేళ్ళకే 13 మంది యువకులను మోసం చేసింది. ఆ సంఖ్యను మరింత పెంచేందుకు సిద్థమైంది. కానీ సీన్ రివర్స్ అయ్యి అరెస్టయ్యింది. పెళ్ళి పేరుతో మోసం చేస్తున్న సోను అనే యువతిపై ఆమెను పెళ్లిచేసుకున్నవారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
 
హింగోలి జిల్లా సాదా అనే ప్రాంతానికి చెందిన సోను అనే యువతికి భూషణ్ అనే యువకుడితో మే 6వ తేదీన వివాహం జరిగింది. కొన్నిరోజుల పాటు అతనితో సంతోషంగా ఉంది. అయితే మే 19వ తేదీన ఇంటి నుంచి పారిపోయింది. భర్త, అతని తరపు బంధువులు ఆమెను వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో సోను సోదరుడికి వారు ఫోన్ చేయగా తన వద్ద లేదని తెలిపాడు.
 
ఆ తర్వాత అతడు ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. దీంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు భూషణ్. మరోవైపు సోను మరో యువకుడితో పెళ్ళికి సిద్ధమైంది. అయితే పెళ్ళిపీటల దగ్గరకు పోలీసులు వస్తున్నారని తెలుసుకుని పరారైంది. అక్కడి నుంచి పారిపోయి దులేబాద్ అనే ప్రాంతానికి చేరుకుంది. అయితే నిత్యపెళ్ళికూతురు దులేబాద్ ప్రాంతంలో ఉన్నారని సమాచారం రావడంతో పోలీసులు చాకచక్యంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments