భార్యనే సర్వస్వం అనుకున్నాడు. ఆమె కోసం ఎంతో కష్టపడి ఆస్తులు కూడబెట్టాడు. ఇంట్లో తను లేకున్నా భార్యకు మాత్రం ఏ లోటు రానివ్వలేదు. కావాల్సినంత డబ్బులు పంపించాడు. ఇదే తను చేసిన తప్పని ఆ తరువాత తెలుసుకున్నాడు. తన భార్య వేరో యువకుడితో ఎంజాయ్ చేస్తోందని వీడియో కాల్‌లో చూసి షాకయ్యాడు.
యుపిలోని నోయిడా ప్రాంతానికి చెందిన కమల్ ప్రసాద్‌కు నాలుగేళ్ళ క్రితం సోనీ అనే మహిళతో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. కమల్ ప్రసాద్ ముంబై, నోయిడా మధ్య తిరుగుతూ పనిచేస్తూ ఉండేవాడు. ఒకసారి పనిమీద వెళితే వారంరోజుల తరువాత వచ్చేవాడు.
ఇలా ఉద్యోగరీత్యా తిరుగుతూ ఉన్నాడు. అయితే సోనీ పెళ్ళికి ముందే జగ్గు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. జగ్గుకు ఆస్తి లేకపోవడంతో కమల్‌కు బలవంతంగా సోనీని ఇచ్చి వివాహం చేశారు. ఇది ఏ మాత్రం సోనీకి ఇష్టం లేదు. కానీ పెళ్లయిన తరువాత భర్త ఆప్యాయంగా చూసుకోవడం.. ఆస్తులు కూడబెడుతూ ఉండటంతో అక్కడే ఉండిపోయింది.
కానీ ప్రియుడిని మాత్రం ఆమెని వదిలిపెట్టలేదు. భర్త ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళడంతోనే.. ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేయడం అలవాటుగా మార్చుకుంది. ఇలా ఏడాదిగా సాగుతోంది వీరి వ్యవహారం. మొదట్లో భార్య గురించి ఇరుగుపొరుగు వారు విషయం చెప్పినా నమ్మలేదు అతను.
భార్యపై నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే చివరకు అతడిని నిలువునా ముంచింది. చెల్లెలి పెళ్ళి ఉందని చెప్పింది సోనీ. అయితే తనకు పని ఉందని.. పెళ్ళికి నువ్వెళ్ళిరా అంటూ పంపాడు భర్త. అప్పటికే తాను ఉద్యోగరీత్యా బయటి ప్రాంతంలో ఉండటంతో ప్రియుడితో కలిసి కారులో నగదు తీసుకుని సోనీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది.
ఆగ్రాకు వెళ్ళి రెండువారాల పాటు ఎంజాయ్ చేయాలన్నది వారిద్దరి ప్లాన్. అయితే ప్రియుడితో కలిసి సోనీ కారులో వెళ్ళడాన్ని స్వయంగా చూశాడు కమల్ తమ్ముడు. ఈ విషయాన్ని అన్నకు చెప్పాడు. తన ఇంటి పక్కనున్న సి.సి. పుటేజ్‌ను తన సెల్ ఫోన్‌కు పంపించమన్నాడు.
ఆ వీడియోలో తన కారులో వేరే వ్యక్తితో తన భార్య వెళ్ళడం చూశాడు. ఆ తరువాత సోనీ ఇంటికి ఫోన్ చేశాడు. ఇక అతనికి అంతా అర్థమైంది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.