Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రష్యన్ యువతి అందరి నోళ్లలోనూ పోస్తూ నా నోట్లోనూ పోసింది, అందులో ఏముందిరా?

రష్యన్ యువతి అందరి నోళ్లలోనూ పోస్తూ నా నోట్లోనూ పోసింది, అందులో ఏముందిరా?
, సోమవారం, 12 అక్టోబరు 2020 (21:21 IST)
ఏపీలోని అధికార వైకాపాకు చెందిన అసంతృప్త ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుకు మరోమారు ఆగ్రహం వచ్చింది. దరిద్రుల్లారా బాగుపడండి.. లేకపోతే శ్రీకృష్ణ జన్మస్థానమేనంటూ అధికార వైకాపా నేతలను ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు. అంతేకాదు.. గతంలో ఓ రష్యన్ యువతి తన నోట్ల  షాంపేన్ పోస్తుంటే... తాగుతున్న ఫోటోపై కూడా స్పందించారు. ఆ రష్యా యువతి షాంపేనే కదా పోస్తుంది.. ఆ ఫోటోలో ఏముందిరా అంటూ ప్రశ్నించారు. 
 
కాగా సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా తన పాత ఫొటో ప్రచారం చేస్తున్నారని, అదెప్పుడో మూడేళ్ల నాటి ఫొటో అని వివరించారు. అందులో ఓ రష్యన్ యువతి షాంపేన్ పోస్తుండగా, రఘురామకృష్ణరాజు తాగుతున్న దృశ్యం ఉంది. ఈ ఫొటోను రఘురామకృష్ణరాజు మీడియాకు చూపించారు.
 
'ఈ ఫొటో కోల్‌కతాలో కానీ, హైదరాబాద్‌లో కానీ తీసినది అయ్యుంటుంది. ఓ తెలుగు ఎంపీ ఫంక్షన్‌లోది అనుకుంటా. ఈ ఫొటోను నేను కూడా ఎప్పుడూ చూసుకోలేదు. బహుశా ఈ ఫొటోను పెద్దలు సుబ్బారెడ్డి‌గారు అందించారనుకుంటున్నాను, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
 
ఈ ఫొటోలో చూస్తున్నట్టుగా నేను ఎవరినీ ముట్టుకోలేదు. క్రికెట్ పోటీల్లో విజేతలకు షాంపేన్ అందించడం తెలిసిందే. గెలిచినవాళ్లు కొంచెం నోట్లో పోసుకుంటారు. నేను తాగింది కూడా షాంపేనే. అది పెద్దగా మద్యం కేటగిరీలోకి కూడా రాదు.
 
ఇక, ఈరోజుల్లో ఫంక్షన్లంటే రష్యన్ యువతులు కామన్ అయిపోయారు. ఆ యువతులు అందరి నోళ్లలోనూ పోస్తూ నా నోట్లోనూ షాంపేన్ పోశారు. ఆ సందర్భంగా నేను ఎవరినీ తాకలేదు... ఆమె దూరంగా ఉండి షాంపేన్ పోసింది. అయినా, నేను కొంచెం షాంపేన్ తాగితే మీకేంట్రా సంతోషం వెర్రివెధవల్లారా... ఏముందిరా ఆ ఫొటోలో?" అంటూ ఆవేశంగా అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొత్స సత్యనారాయణ పెయిడ్ ఆర్టిస్ట్.. అన్నదెవరు?