Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ విద్యార్థుల ఘాతుకం.. బాలికను రేప్ చేసి చెట్టుకు ఉరితీశారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (10:25 IST)
పదో తరగతి చదివే విద్యార్థులు ఓ ఘాతుకానికి ఒడిగట్టారు. ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడి.. ఆపై చెట్టుకు ఉరివేశారు. ఈ దారుణం అస్సాం రాష్ట్రంలోని బిశ్వనాథ్ జిల్లాలోని చక్లా అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ కేసు వివరాలను పరిశీలిస్తే, చక్లా గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరంతా ఓ బాలికను నమ్మించారు. తమ ఇంట్లో పార్టీ ఉందని, ఎంజాయ్ చేద్ధాం రమ్మని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ ఇంటి పక్కనే ఉన్న అడవిలోకి ఆ బాలికను తీసుకెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత బాలికను దారుణంగా చంపేశారు. బాలిక ఆత్మహత్య చేసుకుందని నమ్మించేందుకు చెట్టుకు వేలాడదీశారు. ఆధారాలు దొరక్కూడదన్న ఉద్దేశంతో పక్కా ప్రొఫెషనల్‌గా హత్యాచారానికి పాల్పడింది పదో తరగతి విద్యార్థులు కావడం అందరిని షాక్‌కి గురిచేసింది.
 
అయితే, తమ బిడ్డ రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామానికే చెందిన ఇద్దరు టీనేజర్లపై అనుమానం వచ్చి వారి కోసం వెతకగా అటవీ ప్రాంతంలో కనిపించారు. బాలిక కుటుంబ సభ్యులు రావడం గమనించి టీనేజర్లు అక్కడి నుంచి పరారయ్యారు. 
 
అటవీ ప్రాంతంలోనే ఏదో జరిగి ఉంటుందన్న అనుమానంతో క్షుణ్ణంగా గాలించగా బాలిక మృతదేహం కనిపించింది. ఓ చెట్టుకు బాలిక మృతదేహం వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు చూసి కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఏడుగురు టీనేజర్లపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments