కన్న కుమార్తె మృతదేహం వద్ద తండ్రి కన్నీరుమున్నీరు, బూటు కాలితో తన్నిన పోలీస్, ఏమైంది?

గురువారం, 27 ఫిబ్రవరి 2020 (18:10 IST)
బూటు కాలితో తన్నిన పోలీసు

ప్రముఖ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని సంధ్య ఆత్మహత్య చేసుకుంది. దీనితో కలకలం రేగింది. విద్యార్థిని మృతదేహాన్ని సంగారెడ్డిలోని పటాన్‌చెరులో ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకువచ్చారు. దీనితో విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
 
విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకుని వారిని తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు-విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఎట్టకేలకు వారినందరినీ వాహనంలో ఎక్కించి స్టేషనుకి తరలించారు. అంతకుముందు వారంతా కలిసి ఆసుపత్రిలోని పోస్టుమార్టం గది తలుపులను, అద్దాలను ధ్వంసం చేశారు.
 
మరోవైపు కుమార్తె మృతదేహం వద్ద ఆమె తండ్రి రోదిస్తున్నాడు. తన కుమార్తె మృతదేహాన్ని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు గట్టిగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ పోలీసు మృతురాలి తండ్రి పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కాలితో తన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాతీయ మీడియా సైతం ఆ వీడియోను హైలెట్ చేశాయి. చూడండి వీడియో...
 

Very disturbing... Body of 16-year-old girl who died under suspicious circumstances at private junior college in #Patancheru being shifted at breakneck speed by @TelanganaPolice; girl's father who wanted to stop & ask questions is kicked by the policeman; where is empathy?? @ndtv pic.twitter.com/QcoUsnBuY1

— Uma Sudhir (@umasudhir) February 26, 2020

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం దాయాది దేశానికి పాకిన కరోనా.. కరాచీలో రెండు కేసులు (video)