"నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని కోరిక - ఒక కొడుకు కథ"

అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్‌ను చాలా ప్రేమిస్తారు! వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్‌గా.. శ్రద్ధగా.. ఇష్టంగా చూసుకుంటారు. చాలా సార్లు నా కన్నా ఎక్కువగా కూడా. నాన్న ఆఫీసు నుంచి అలసటతో వచ్చినప్పుడు, అతనికి

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (12:40 IST)
"రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాస రచన పేపర్లనుదిద్దడం ప్రారంభించింది. ఆమె పిల్లలు పడుకున్నారు! భర్త  కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్‌లో అభిమాన 'క్యాండీ క్రష్ సాగా' ఆటలో లీనమై ఆసక్తిగా ఆడుతున్నాడు. చివరి పేపర్ దిద్దడానికి తీసి అందులో రాసిన సమాధానాన్ని చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి గేమ్ ఆడుతున్న ఆమె భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!
 
 
"ఓయ్! ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? చాలా రోజుల నుండి నేను నిన్నేమి అనటం లేదుగా" అని అన్నాడు. అపుడు భార్య టెన్షన్‌తో సమాధానమిస్తూ, "నిన్న నా సెకండ్ క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను!", "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రండీ!" అని చెప్పాను. 
 
తాను ఒక ప్రశ్నను అడిగితే.. మరో సమాధానం చెబుతున్న భార్యను విసుగ్గా చూస్తూ "సరేగానీ.. నీవ్వెందుకు ఏడుస్తున్నావు?" అంటూ గద్దించాడు. "ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు" అని సమాధానమిచ్చింది. భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడాబాబు?" అని అడిగాడు. వినండి చదువుతాను. 
 
హెడ్డింగ్ ఇలా పెట్టాడు..
"నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక"... 
 
అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్‌ను చాలా ప్రేమిస్తారు! వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్‌గా.. శ్రద్ధగా.. ఇష్టంగా చూసుకుంటారు. చాలా సార్లు నా కన్నా ఎక్కువగా కూడా. నాన్న ఆఫీసు నుంచి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్‌ఫోన్ రిలాక్స్‌ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు!. ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్‌ను ఇవ్వడంలేదు. అమ్మానాన్నలు, ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చే లోపే వాళ్ళు ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు. కానీ, నేను ఎన్నిసార్లు పిలిచినా ఫోన్‌కిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు. 
 
ఒకవేళ నేను అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటే కూడా.... చివరికి అప్పుడు కూడా వాళ్ళు నాతోకాకుండా స్మార్ట్ ఫోన్‌తోనే గడుపుతుంటారు. వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు. వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు! అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!! కానీ వాళ్ళకి అది ముఖ్యం కాదు! 
 
అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్‌కి జవాబిస్తారు!. 
అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్‌ని కేర్‌గా చూసుకుంటారు!
ఎప్పుడూ తమతోనే ఉంచుకుంటారు! 
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు! 
దాన్ని చాలా ఇష్టపడుతారు!! 
దాంతో రిలాక్స్ అవుతుంటారు!! 
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!
 దాంతో ముచ్చట్లు పడుతారు! 
దాన్ని చూస్తూ ముసిముసినవ్వులు నవ్వుతారు!
 పడుకుంటునప్పుడు కూడా తమపక్కలోనే ఉంచుకుంటారు!!
 ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు!!
 దాంతో చాలా ఆనందంగా ఆడుకుంటారు!!
 దాన్ని ప్రేమిస్తారు!!
 
కాబట్టి! నా కోరిక ఏమిటంటే.. నేను అమ్మానాన్న చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటున్నాను!! 
 
 భార్య చదువుతుంటే శ్రద్ధగా ఆలకించిన భర్తకు కూడా మనసంతా పిండేసినట్లైంది!! ఉద్వేగభరితుడయ్యాడు. అతని కళ్ళు కూడా తడిబారాయి. "ఎవరు రాశారది?" అని భార్యను అడిగాడు. ఆమె బొంగురుగొంతుతో 
"మన కొడుకు" అంటూ సమాధానమిచ్చింది కన్నీరుకార్చుతూ.!!!.
 
వస్తువులను ఉపయోగించుకోవాలి! 
బంధాలను ప్రేమించాలి!! 
 
అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరుచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు కనుమరుగైపోతాయన్నదే ఈ కథ సారాంశం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంటగలిసిపోతున్న కుటుంబ విలువలు.. భార్యాబిడ్డల్ని హత్యచేసి వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రంతా కురిసిన వర్షాలు.. ప్రజలకు వేడి నుంచి ఉపశమనం

ప్రియుడు గదికి కుమార్తెను బలవంతంగా పంపిన తల్లి... ఎక్కడ?

చంద్రునిపై అన్వేషణ మిషన్లకు మద్దతుగా రోబోటిక్ ల్యాండర్లు, రోవర్లు, డ్రోన్‌లు

అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

తర్వాతి కథనం
Show comments