Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

శీతాకాలం రాగానే శరీరం పొడిబారినట్లవుతుంది. కొందరిలో చర్మం చిట్లుతుంది. పెదవులు పగిలిపోతుంటాయి. ముఖ్యంగా మహిళలు శరీరం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. పొడి చర్మం కలిగిన వారైతే... రెండు టీ స్పూన్లు బాదంనూనె, రెండు టీస్పూన్ల బాదం పొడి, రెండు టీ స్పూన్లు

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (19:36 IST)
శీతాకాలం రాగానే శరీరం పొడిబారినట్లవుతుంది. కొందరిలో చర్మం చిట్లుతుంది. పెదవులు పగిలిపోతుంటాయి. ముఖ్యంగా మహిళలు శరీరం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. పొడి చర్మం కలిగిన వారైతే... రెండు టీ స్పూన్లు బాదంనూనె, రెండు టీస్పూన్ల బాదం పొడి, రెండు టీ స్పూన్లు అరటి ముక్కలు, రెండు టీస్పూన్లు గ్లిజరిన్ లేదా తేనే, నాలుగు టీ స్పూన్లు పాలు కలిపి మెత్తని గుజ్జు మాదిరి పేస్ట్ చేసి ముఖానికి, మెడకు మృదువుగా మసాజ్ చేస్తూ పట్టించి కొద్దిసేపు వుంచి కడిగేయాలి. చర్మం మృదువుగా మారుతుంది. శీతాకాలంలో అద్భుతంగా పనిచేస్తుంది. చేతులు, పాదాలకు కూడా అప్లయ్ చేయవచ్చు. 
 
జిడ్డు చర్మం కలిగిన వారు.. రెండు టీ స్పూన్లు ఓట్‌మీల్‌ పొడి, నాలుగు టీ స్పూన్లు మజ్జిగ, రెండు టీ స్పూన్లు గంధం పొడి కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించి, గోరువెచ్చని నీటితో కడిగేస్తే జిడ్డు చర్మం పోయి కాంతివంతంగా ఉంటుంది. 
 
ఇక శిరోజాల సంరక్షణకు.. ఒక కప్పు బొప్పాయి గుజ్జు, అరకప్పు కొబ్బరి క్రీమ్ లేదా పాలు, పావు కప్పు కొబ్బరినూనె, పావు కప్పు బీట్ రూట్ జ్యూస్ కలిపి పేస్టు తయారు చేసుకుని జుట్టుకు,  పట్టించాలి. పదినిమిషాలాగి హెర్బల్ షాంపూతో వాష్ చేసుకోవాలి. శీతాకాలంలో ఈ ప్యాక్ జుట్టును పరిరక్షిస్తుంది. జుట్టురాలడాన్ని, చుండ్రును తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments