స్కిన్ షోస్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇస్తున్న సీనియర్ హీరోయిన్లు (వీడియో)

ఛాన్సుల కోసం స్కిన్ షోస్‌కు సిద్ధమంటున్నారు పలువురు సీనియర్ హీరోయిన్లు. నిజానికి ఈ హీరోయిన్లకు వరుస ఆఫర్లు వస్తున్న సమయంలో కనీసం బికినీలు సైతం ధరించేందుకు ససేమిరా అన్నారు. కానీ, ఇపుడు అవకాశాలు లేకపోవడ

సోమవారం, 13 నవంబరు 2017 (14:47 IST)
ఛాన్సుల కోసం స్కిన్ షోస్‌కు సిద్ధమంటున్నారు పలువురు సీనియర్ హీరోయిన్లు. నిజానికి ఈ హీరోయిన్లకు వరుస ఆఫర్లు వస్తున్న సమయంలో కనీసం బికినీలు సైతం ధరించేందుకు ససేమిరా అన్నారు. కానీ, ఇపుడు అవకాశాలు లేకపోవడంతో స్కిన్ షోకు సై అంటూ దర్శకనిర్మాతలకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు.
 
వాస్తవానికి బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే స్కిన్ షో తప్పనిసరి. కానీ, దక్షిణాదిలో ఇందుకు భిన్నం. సిల్వర్ స్క్రీన్‎పై స్టార్ డమ్ వచ్చిన కథానాయికలైతే అందాల ప్రదర్శనకు ఆమడ దూరంలో ఉంటుంటారు. కానీ ఇప్పుడు కొంతమంది సీనియర్ హీరోయిన్స్ రూటు మార్చారు. తాము కూడా అందాల ఆరబోతకు సై అంటూ సిగ్నల్ ఇస్తున్నారు.
 
ఇప్పటివరకూ వెండితెరపై అందాల ప్రదర్శనకు అంతగా ఆసక్తి చూపించని సీనియర్ హీరోయిన్స్ త్రిష, శ్రియ, కాజల్, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు ఈ మధ్య హాట్ హాట్ ఫోటో షూట్స్‎తో అలరిస్తున్నారు. ఇటీవలే త్రిష ఓ తమిళ మేగజైన్ కోసం ఘాటు అందాలను ఆరబోస్తే, మరోవైపు శ్రియ అండర్ వాటర్‎లో టూ పీస్ బికినీ‎తో రెచ్చిపోయింది. 
 
ఫేడవుట్ హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోతున్న కాజల్, శృతి హాసన్ కూడా ఇప్పుడు అందాలతో హీట్ పుట్టిస్తున్నారు. లేటెస్ట్‌గా రిట్జ్ మేగజైన్ కోసం కాజల్ ఎద అందాలను చూపిస్తే, పలు బాలీవుడ్ మేగజైన్స్ కోసం స్కిన్ షోస్‎తో శృతిహాసన్ రెచ్చిపోతుంది.
 
మొత్తంమీద మూడు పదులు దాటిపోయిన సీనియర్ హీరోయిన్స్ అంతా మేగజైన్స్ కోసం హాట్ హాట్ ఫోటోషూట్స్‎లో రెచ్చిపోతున్నారు. మరి వీరి కృషికి ఫలితంగా ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కుతాయో వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చై-సామ్‌ల రిసెప్షన్.. తరలివచ్చిన తారాలోకం (వీడియో)