Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలే శీతాకాలం.. పిల్లలకు జలుబు చేస్తే?

శీతాకాలంలో పిల్లలకు జలుబు చేస్తుంది. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ల వద్దకు తీసుకెళ్లి మందుల్ని, సిరప్‌లను వాడేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. పిల్లల్లో జలుబు మాయం కావాలంటే ఈ టిప్స్ పాటించండి. జలుబుతో బాధ

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (14:39 IST)
శీతాకాలంలో పిల్లలకు జలుబు చేస్తుంది. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ల వద్దకు తీసుకెళ్లి మందుల్ని, సిరప్‌లను వాడేస్తున్నారా? అయితే కాస్త ఆగండి.  పిల్లల్లో జలుబు మాయం కావాలంటే ఈ టిప్స్ పాటించండి. జలుబుతో బాధపడుతున్న పిల్లలకు అరస్పూన్ తేనె ఇవ్వండి. రోజులో రెండు, మూడుసార్లు పిల్లలకు తేనె ఇవ్వడం మంచిది. ఐదేళ్లు పైబడిన పిల్లలకు ఒకస్పూన్‌ తేనెలో కాస్త దాల్చిన చెక్క పొడి వేసి ఇవ్వడం వల్ల జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. 
 
అలాగే ఓ గ్లాసుడు నీటిలో చిటికెడు ఓమ, తులసి ఆకులు వేసి మరిగించాలి. ఈ నీటిని తాగించడం ద్వారా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆవాల నూనెను ఒక స్పూన్ తీసుకుని వేడిచేసి.. అందులో వెల్లుల్లి కలిపి పిల్లల ఛాతిపై, వీపుపై రాసి మెల్లగా మసాజ్ చేస్తే జలుబు తగ్గిపోతుంది. అదే నూనెతో అరచేతులు, పాదాలు కూడా మసాజ్‌ చేయాలి. దీనివల్ల పిల్లలకు జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
జలుబుతో పిల్లలు బాధపడుతుంటే గోరువెచ్చని నీటిని తాగించాలి. నీళ్లు తాగేలా చూడాలి. తద్వారా గొంతు నొప్పి తగ్గడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. జ్యూస్‌, గోరువెచ్చని సూప్‌లు ఇవ్వడం వల్ల కూడా ఎనర్జీ లెవెల్స్‌ పడిపోకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

తర్వాతి కథనం
Show comments