Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాల పౌడర్‌తో చర్మం మెరిసిపోతుంది.. ఎలా?

పాల పౌడర్‌తో చర్మం మెరిసిపోతుంది.. అంటున్నారు.. బ్యూటీషియన్లు. పాల పౌడర్లో నిమ్మరసం, తేనె చేర్చి పేస్టులా తయారయ్యాక.. ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్ల

పాల పౌడర్‌తో చర్మం మెరిసిపోతుంది.. ఎలా?
, శుక్రవారం, 15 డిశెంబరు 2017 (16:38 IST)
పాల పౌడర్‌తో చర్మం మెరిసిపోతుంది.. అంటున్నారు..  బ్యూటీషియన్లు. పాల పౌడర్లో నిమ్మరసం, తేనె చేర్చి పేస్టులా తయారయ్యాక.. ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మ ఛాయ పెంపొందుతుంది.  
 
అలాగే ఓట్స్‌ను ముందు రోజు రాత్రే నానబెట్టి మరుసటి రోజు ఉదయం పేస్టులా రుబ్బుకుని.. పుల్లటి పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మిల మిల మెరిసిపోతుంది. నిమ్మ తరహాలోనే బంగాళాదుంప బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాటోను పేస్టులా చేసుకుని.. దాన్ని రోజూ ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. 
 
ఇకపోతే.. తులసీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. తులసీలో యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వుండటంతో చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతుంది. మొటిమలను తొలగిస్తుంది. అందుకే తులసీ ఆకుల పేస్టును రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. కుంకుమపువ్వును పాలతో కలిపి పేస్టులా చేసి.. ముఖానికి రాసుకుని 30 నిమిషాల తర్వాత కడిగేస్తే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. చర్మ ఛాయ మెరుగుపడుతుంది. పసుపు, టమోటాను పేస్టులా చేసి.. ముఖానికి రాసుకుంటే మొటిమలు తొలగిపోతాయి. 
 
బాదం నూనెను వేడి చేసి.. ముఖానికి రాసుకుని మసాజ్ చేసి.. కాసేపు 15 నిమిషాల తర్వాత సబ్బుతో శుభ్రం చేసుకుంటే ముఖంలో రక్త ప్రసరణ మెరుగవడం ద్వారా చర్మం ప్రకాశిస్తుంది. సున్నిపిండి, మజ్జిగతో పేస్టులా చేసి.. ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 15 నిమిషాల పాటు వుంచి కడిగేస్తే.. చర్మం సౌందర్యం మెరుగుపడుతుంది. పుదీనా ఆకులను పేస్టులా రుబ్బుకుని.. ముఖానికి పట్టించి 10-15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. బనానా ఫేస్ ప్యాక్ ద్వారా చర్మ ఛాయను పెంపొందించుకోవచ్చు. 
 
అరటి గుజ్జుకు ఒక టీ స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనె చేర్చి ముఖానికి మాస్క్‌ల వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. జిడ్డు చర్మం కలిగిన వారు.. చందనాన్ని నీటిలో కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి పట్టిస్తే చర్మం తాజాగా మారుతుంది. రోజూ చందనం ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. చర్మంపై వున్న నల్లటి మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహ వ్యాధిగ్రస్థులు బోర్న్‌విటా, కాంప్లాన్ తీసుకోకూడదట..