వారు కాలిగా ఉంటే.. ఇలా చేయించాలి..?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (15:06 IST)
బడి ఉన్నప్పుడే కాదు సెలవు రోజుల్లో కూడా పిల్లలకు టైంటైబుల్‌ వేయాలి. అంటే.. తినడానికి, ఆటలకు, విశ్రాంతికి, టీవీ చూడ్డానికి, ఫోన్ గేమ్స్‌కు పక్కాగా సమయం నిర్ణయించాలి. ఇలా చేయడం వలన వారిలో క్రమశిక్షణ అలవడుతుంది. అంతేకాదు ఎక్కువ సమయం టీవీ, ఫోన్‌కు అతుక్కుపోకుండా ఉంటారు.
 
పిల్లలను కుదిరినప్పుడల్లా పార్కుకు తీసుకెళ్లాలి. కాస్త పెద్ద పిల్లలయితే బయట వాళ్లంతట వాళ్లు ఆడుకోమని చెప్పాలి. అప్పుడే వారు శారీరకంగా చురుగ్గా ఉంటారు. సమయం ఉన్నప్పుడు బంధువులు, స్నేహితుల ఇళ్లకు తీసుకెళ్లడం వారితో మాట్లాడించడం, విందులు వేడుకలకు వెంట పెట్టుకెళ్లడం వంటివి చేస్తుండాలి. దీని వలన వారికి బంధువులు, స్నేహితులు తెలిసే అవకాశం ఉంటుంది. దాంతో వారి ప్రపంచం కూడా మారుతుంది.
 
ఇంటి పనుల్లో పిల్లల సాయం తీసుకోవడం వలన వాళ్లకు పనులు అలవాటవుతాయి. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని పట్టించుకునేదేముంటుంది అనుకుంటారు చాలామంది. అలా అనుకోవడం సరికాదు. పిల్లలతో మాట్లాడుతూనే పనిచేయాలి. పనిలేనప్పుడు వారితో కబుర్లు చెప్పడం.. లేదంటే వారితో చెప్పించుకోవడం చేయాలి. అప్పుడే వారిలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెరుగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అర్థరాత్రి వీధికుక్కల ఊళలు, కరుస్తున్నాయని 600 కుక్కల్ని చంపేసారు?!!

సంక్రాంతి కోడిపందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న గుడివాడ వాసి

బ్యాకేజీ కంటెయిన్‌ను లాగేసుకున్న ఎయిరిండియా ఫ్లైట్ ఇంజిన్

స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు

మహిళా ఐఏఎస్ అధికారులను కించపరిచిన వారిపై కఠిన చర్యలు : పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

తర్వాతి కథనం
Show comments