Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు ఎప్పుడైనా బ్లూ టీ గురించి విన్నారా?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (14:44 IST)
ప్రస్తుతం అందరూ హెర్బల్ టీ తాగేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న అనేక మంది సాధారణ టీ కాకుండా హెర్బల్ టీ తాగుతున్నారు. అందులోనూ ప్రముఖంగా గ్రీన్ టీని సేవిస్తున్నారు. దీనితో పాటు అనేక రకాల టీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే వీటితో పాటుగా బ్లూ టీ అనే మరొక టీ వెరైటీ కొత్తగా వచ్చి చేరింది. బ్లూ టీ తయారీ విధానం ఏమిటో, అలాగే దాంతో కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 
 
బ్లూ టీ పౌడర్‌ను Clitoria ternatea అనే మొక్క పువ్వులను ఎండబెట్టి తయారు చేస్తారు. వాస్తవానికి ఈ మొక్క మన చుట్టు పరిసర ప్రాంతాల్లోనే పెరుగుతుంది. వీటి నుండి పువ్వులను తీసి నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. ఆ తర్వాత ఎండబెట్టిన పొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. దీంతో డికాషన్ తయారవుతుంది. ఆ డికాషన్‌ని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి. రుచి కోసం అందులో నిమ్మరసం లేదా తేనెను కలుపుకోవచ్చు.
బ్లూ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
 
* బ్లూ టీ తాగడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మం మృదువుగా మారుతుంది.
* మానసిక ప్రశాంతత కలుగుతుంది.
* అధిక బరువు తగ్గుతారు.
 
* బ్లూ టీ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి.
* శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* డయాబెటిస్ ఉన్న వారు బ్లూ టీ తాగితే మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

తర్వాతి కథనం
Show comments