Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారికి ధైర్యాన్ని నేర్పించడం ఎలా..?

వారికి ధైర్యాన్ని నేర్పించడం ఎలా..?
, సోమవారం, 18 మార్చి 2019 (12:47 IST)
అమ్మగా మీ పిల్లలకు ప్రేమానురాగాలు తప్పకుండా పంచాలి. వాటితో పాటు వారిలో మానసిక ధైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేయాలంటున్నారు వైద్యులు. ఆనందంగా ఉండాలంటే.. మనసుకు నచ్చిన పనిచేయాలి. పిల్లలకు అది అలవాటు చేయాలంటే.. వారికి ఇష్టమైన అభిరుచిలో శిక్షణ ఇప్పించాలి. అది వారికి ఓ వ్యాపకంగా మాత్రమే కాకుండా.. ఇష్టమైన పనిని చేస్తున్నామనే సంతోషం కలిగిస్తుంది.
 
ఎప్పుడూ పిల్లలు ఆశావహా దృక్పథంతోనే ముందుకు సాగేలా చూడాలి. అది సాధ్యం కావాలంటే.. నువ్వు ఏదైనా చేయగలవు ప్రయత్నించి చూడు అనాలే తప్ప.. నీ వల్ల కాదు అని మాత్రం పిల్లలకు చెప్పకూడదు. పిల్లలకు వీలున్నప్పుడల్లా కథలు చెప్పాలి. కుదిరితే కేవలం విజయ గాథలే కాదు.. అపజయాలు ఎలా ఉంటాయో.. వాటి నుండి ఏం నేర్చుకోవాలనేది నేర్పించాలి.
 
కొందరు చిన్నారులు చిన్నచిన్న వాటికే భయపడుతుంటారు. మీ పిల్లలు కూడా దీనికి మినహాయింపు కాకపోతే వారికి భయానికి కారణం తెలుసుకుని దానినుండి ఎలా అధికమించొచ్చో నేర్పించాలి. అప్పుడే భవిష్యత్తులో వారికి ఎదురయ్యే ప్రతి ఒక్క పరిస్థితిని తట్టుకుని ముందుకు వెళ్లగలుగుతారు. చిన్నతనం నుండి వాళ్లు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. అప్పుడే వాళ్లు ఎదిగేకొద్దీ ఇతరులపై ఆధారపడకుండా ఉండగలుగుతారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒత్తిడికి కారణాలేంటి?