Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు ... ఏంటవి?

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (19:32 IST)
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ నుంచి కొత్త ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పంపిన సమాచారంలో తప్పులను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తోంది. అది కనుక అందుబాటులోకి వస్తే పంపిన సమాచారంలోని తప్పొప్పులను సరిచేసుకునే అవకాశం లభిస్తుంది. 
 
ప్రస్తుతం ఈ ఫీచర్ మూడు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది అన్ని దేశాలకు అందుబాటులోకి తీసుకునిరావాలని ట్విటర్ యాజమాన్యం భావిస్తోంది. ట్విట్టర్‌లో ఎడిట్ ఫీచర్‌లానే ఇది కూడా పనిచేస్తుందని సమాచారం. ప్రస్తుతం ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. 
 
ప్రస్తుతం యూజర్లు ఏదైనా సమాచారాన్ని పంపిన తర్వాత అందులో ఏదైనా తప్పులు కనిపిస్తే ఎడిట్ చేసుకునే అవకాశం లేదు. మరో కొత్త మెసేజ్ పంపడమో, లేదంటే పాత మెసేజ్‌ను డిలీట్ చేసి కొత్త దానిని పంపడమో చేయాల్సి వస్తోంది. అయితే, ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఆ తిప్పలు తప్పినట్టే. అయితే, 15 నిమిషాల్లోపే ఎడిట్ చేసుకునే వెసులుబాటు వుంది. ఆ సమయం మించిపోతే మాత్రం ఎడిట్ చేయడం వీలుపడదు. 
 
ప్రస్తుతం అభివృద్ధి, ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ అప్‌డేట్‌తోపాటు మరో అప్‌డేట్‌ను కూడా తీసుకొస్తోంది. వాట్సాప్‌‌లోని గ్రూప్ సభ్యుల సంఖ్యను 1024కు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా సమాచారం. ప్రస్తుతం ఈ సంఖ్య 512గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments